Naidupeta: నాయుడుపేటలో రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్ట్‌ల పంపిణీ!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని 32 వార్డులకు సంబంధించిన 2026 ఓటర్ల జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కమిషనర్ షేక్ ఫజులుల్లా అందజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Sept 2026 5:28 PM IST
Naidupeta
X

Naidupeta: నాయుడుపేటలో రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్ట్‌ల పంపిణీ!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట లోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎన్నికలు సమయం లో జాతీయ గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్టులను పంపిణీ చేయడం జరుగుతుంది అని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జులుల్ల తెలిపారు, ఈ సమావేశంలో నాయుడుపేట మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు,

ఈ సందర్భంగా నాయుడుపేట మునిసిపల్ కమిషనర్ షేక్ పజ్జులుల్ల మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు సిద్ధం అయ్యే కార్యక్రమాలలో మొదటగా 2026 సర్వే ఓటర్ లిస్టులను ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు ఓటర్ లిస్టుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలలో నోటీసులు అంటించడం జరుగుతుందని, అలాగే జాతీయ గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్టులను అందజేసి వారి సంతకాలను తీసుకోవడం జరుగుతుందని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జులుల్ల తెలిపారు, నాయుడుపేట మున్సిపాలిటి కి సంబంధించి 32 వార్డులు ఉన్నాయని ఈ 32 వార్డులకు సంబంధించిన ఓటర్ లిస్ట్ లను తయారు చేసి అన్ని రాజకీయ పార్టీలకు అందజేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ షేక్ పజ్జులుల్ల తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story