Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్
Tiruchanur: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద కేంద్రమంత్రి కి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవిఎస్వో రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు సురేష్, ముని చెంగల్రాయులు, బడి సుధాయాదవ్, ఎడిఫై విద్యాసంస్థల అధినేత, ప్రణీత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రణీత్ పెనుమాదు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న కేంద్రమంత్రి కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




