Tirupati: పుత్తూరు రైల్వే ప్రాంగణంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
Tirupati: తిరుపతి జిల్లా పుత్తూరు రైల్వే స్టేషన్ పోర్టికో వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. వివరాల కోసం పుత్తూరు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి.
Tirupati: పుత్తూరు రైల్వే ప్రాంగణంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
తిరుపతి: పట్టణంలోని రైల్వే ప్రాంగణం పోర్టికో ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. మృతుడు నీలి రంగు చొక్కాపై తెల్లటి గీతల డిజైన్ ఉన్న షర్టు, కాఫీ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. నడుముకు మూడు వరుసలుగా ఎరుపు రంగు దారం కట్టుకుని ఉన్నట్లు గుర్తించారు.
మృతుడు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నప్పటికీ, మరణానికి ఖచ్చితమైన కారణం వైద్య పరీక్షల అనంతరం నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి పేరు, చిరునామా తదితర వివరాలు తెలియరాలేదు. మృతుడి ఫొటోను పరిశీలించి, వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక ప్రజలను పోలీసులు కోరారు.
సమాచారం అందించాల్సిన నంబర్లు:
పుత్తూరు పోలీస్ SI: 9440796728
పుత్తూరు పోలీస్ CI: 9440796727




