Tirumala: తిరుమలలో టీటీడీ పాలకమండలి కీలక భేటీ..50 అజెండా అంశాలపై చర్చ!
Tirumala: చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఎలక్ట్రిక్ బస్సులు, కాంట్రాక్ట్ కార్మికుల టైమ్ స్కేల్‌పై నిర్ణయాలు.
Tirumala: తిరుమలలో టీటీడీ పాలకమండలి కీలక భేటీ..50 అజెండా అంశాలపై చర్చ!
Tirumala: తిరుమలలో నేడు టీటీడీ పాలకమండలి భేటీ కానుంది. చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్యక్షతన ఉ.10:30 గంటలకు అన్నమయ్య భవనంలో సమావేశం కానున్నారు. దాదాపు 50 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనుంది పాలకమండలి.
ప్రధానంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్ణయాలు తీసుకోనుంది బోర్డ్. సీఎం చేతుల మీదుగా మ్యూజియం, 27 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభోత్సవ ఏర్పాట్లుపై చర్చించనున్నారు. 400 మంది అదనపు పొటు కార్మికుల నియామకానికి ప్రతిపాదించునుంది.
డొనేషన్ పాలసీలో స్వల్ప మార్పులు.. నామినీస్ మార్చుకునే అవకాశం కల్పించే అంశంపై చర్చించనున్నారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు సుమారు 1200 మంది కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్ వర్తింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Next Story




