Renigunta: ట్రాన్స్‌ఫార్మర్ పేలినా పట్టించుకోరా?.. విద్యుత్ పునరుద్ధరణకు స్థానికుల డిమాండ్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట బుగ్గవీధిలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
Renigunta: ట్రాన్స్‌ఫార్మర్ పేలినా పట్టించుకోరా?.. విద్యుత్ పునరుద్ధరణకు స్థానికుల డిమాండ్!
రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధిలో సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు లైన్‌మెన్ వచ్చి పరిశీలించి వెళ్లిపోయినా,ఇప్పటివరకు విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులపై దృష్టి సారించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతకు చిన్నపిల్లలు,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు.రాత్రి సమయం కావడంతో విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఇళ్లలో ఫ్యాన్లు,ఇతర విద్యుత్ పరికరాలు పనిచేయక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు పూర్తి చేసి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని బుగ్గ వీధి ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.




