Renigunta: గౌరీనగర్‌లో వినాయకుడికి పూజలు చేసిన హీరో సీఆర్ తేజేశ్వర్!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట గౌరీనగర్‌లో జరిగిన వినాయక ఉత్సవాల్లో టాలీవుడ్ యువ హీరో సీఆర్ తేజేశ్వర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 14 Sept 2026 8:06 PM IST
Renigunta
X

Renigunta: గౌరీనగర్‌లో వినాయకుడికి పూజలు చేసిన హీరో సీఆర్ తేజేశ్వర్!

రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని గౌరీనగర్‌లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో సినీ నటుడు, యువ హీరో సీఆర్‌ తేజేశ్వర్‌ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

వినాయకుడిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు, భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ హీరో తేజేశ్వర్‌ రావడంతో గౌరీనగర్‌లో సందడి నెలకొంది. అభిమానులు, యువత ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు సీఆర్‌ తేజేశ్వర్‌ను ఘనంగా సత్కరించి, వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా భక్తి, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని తేజేశ్వర్‌ ఆకాంక్షించారు.

కార్యక్రమంలో శ్రీ వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సి.టీ సుబ్రహ్మణ్యం,కమల్ నాధ్, కన్నయ్య (గౌరీ నాగర్ ), రోహిణ్,బాలరాజు, విక్కీ ,గోవర్ధన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA