Tirupati: బెట్టింగ్ తెచ్చిన తిప్పలు.. ఈజీ మనీ కోసం చైన్ స్నాచర్లుగా!
Tirupati: తిరుపతి జిల్లాల్లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా కేటుగాళ్లను తిరుపతి సీసీఎస్, వెస్ట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
Tirupati: బెట్టింగ్ తెచ్చిన తిప్పలు.. ఈజీ మనీ కోసం చైన్ స్నాచర్లుగా!
Tirupati: తిరుపతి నగరంతో పాటు నెల్లూరు జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా నిందితులను తిరుపతి సీసీఎస్, వెస్ట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, అలిపిరి–చెర్లోపల్లి రోడ్డులోని సైన్స్ సెంటర్ సమీపంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా కేసులు వెలుగులోకి వచ్చాయి.అరెస్టైన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన శీలం నాగార్జున రెడ్డి,నల్లగొండ వెంకట మురళి, లింగాలదిన్నే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.
వీరు ఉన్నత విద్యలు పూర్తి చేసినప్పటికీ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, విలాసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన సుమారు 130 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు, హెల్మెట్లు, మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో మొత్తం 9 చైన్ స్నాచింగ్ కేసుల్లో తమ ప్రమేయాన్ని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బైక్‌ల నెంబర్ ప్లేట్లు తొలగించి, మాస్కులు ధరించి తెల్లవారుజామున ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడేవారని విచారణలో తేలింది. మరో చైన్ స్నాచింగ్‌కు కుట్ర పన్నుతున్న సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేసి కుట్రను భగ్నం చేశారు.ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాలను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.




