Tirupati: గ్రూప్-1 అక్రమాలు వైఎస్ జగన్ రాజీనామా చేయాలి - రవి నాయుడు
Tirupati: ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలలో భారీ అవకతవకలు జరిగాయని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపణ. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని తిరుపతిలో డిమాండ్.
Tirupati: గ్రూప్-1 అక్రమాలు వైఎస్ జగన్ రాజీనామా చేయాలి - రవి నాయుడు
తిరుపతి: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్-1 నియామకాలలో భారీగా అవకతవకలు జరిగాయని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీని జగన్‌మోహన్‌రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
స్ట్రాంగ్‌రూమ్ వద్ద సీసీ కెమెరాల తొలగింపు, ప్రైవేటు వ్యక్తుల రాకపోకలు, ఓఎంఆర్ షీట్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ప్రశ్నపత్రాలు ముద్రించినట్లు పేర్కొన్నారు.
గ్రూప్-1 నియామకాలపై జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా అని రవి నాయుడు సవాల్ విసిరారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో తెలుగు యువత,టీఎన్‌ఎస్ఎఫ్,టీడీపీ నాయకులు పాల్గొన్నారు.




