Tirupati: బైండ్ ఓవర్ ఉల్లంఘన: రౌడీషీటర్‌కు 14 రోజుల కస్టడీ!
Tirupati: బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించి దాడికి పాల్పడిన రేణిగుంట రౌడీషీటర్ బండి జయచంద్రకు మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Tirupati: బైండ్ ఓవర్ ఉల్లంఘన: రౌడీషీటర్‌కు 14 రోజుల కస్టడీ!
తిరుపతి: బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి మరోసారి గొడవకు పాల్పడిన రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
రేణిగుంట మండలానికి చెందిన *బండి జయచంద్ర (26)*పై గతంలో రేణిగుంట, రైల్వే కోడూరు, గాజులమాండ్యం, ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో అతనిపై రౌడీషీట్ తెరిచారు.
నేరప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించేందుకు అవకాశం కల్పిస్తూ ఈ ఏడాది మే 2న జయచంద్రను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బైండ్ ఓవర్ చేశారు.
అయితే బైండ్ ఓవర్‌లో ఉన్నప్పటికీ ఆగస్టు 17న చెంగారెడ్డిపల్లి గ్రామంలో మద్యం సేవించి గొడవకు పాల్పడి, వ్యక్తులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బైండ్ ఓవర్ నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేసి, సెప్టెంబర్ 7న ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
విచారణ అనంతరం జయచంద్రకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు. రౌడీషీటర్లు నేరప్రవృత్తిని వీడి, మద్యం తదితర వ్యసనాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు.




