Tirupati: అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం.. డ్రోన్లతో కన్ను!

Tirupati: తిరుపతి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా, నేరాల నియంత్రణ.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 2 Aug 2026 6:22 PM IST
Tirupati
X

Tirupati: అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం.. డ్రోన్లతో కన్ను!

తిరుపతి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం

డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా.. ఆధునిక సాంకేతికతతో నేరాల నియంత్రణ

తిరుపతి జిల్లాలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ కెమెరాల సహాయంతో అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, గంజాయి సాగుకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ఇతర అనుమానాస్పద ప్రదేశాలపై ప్రత్యేక వైమానిక నిఘా నిర్వహిస్తున్నారు. భూమిపై పోలీసు బృందాల తనిఖీలతో పాటు డ్రోన్ పర్యవేక్షణను సమన్వయం చేయడం ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభ దశలోనే గుర్తించి అడ్డుకునే చర్యలు చేపడుతున్నారు.

ముఖ్యంగా గంజాయి సాగు, గంజాయి రవాణా, అక్రమ మద్యం తయారీ, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, ఇందులో పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యనైనా ఉపేక్షించబోమని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని అన్నారు. పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story