Tirupati: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంపీడీవో వేనయ్య
Tirupati: తిరుపతి జిల్లా పెళ్ళకూరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల సమావేశం. ఆగిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఎంపీడీవో వేనయ్య ఆదేశం. 16వ ఫైనాన్స్ నిధులపై చర్చ.
Tirupati: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంపీడీవో వేనయ్య
తిరుపతి: తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల సమావేశంలో పాల్గొన్న ఎంపీడీవో వేనయ్య, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో వేనయ్య మాట్లాడుతూ మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయా పంచాయతీలలో అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అందుకు సంబంధించిన చర్యలను అధికారులు వెంటనే తీసుకొని ఆయా పంచాయితీలలో జరుగుతున్న జరిగి ఆగిపోయి ఉన్నా పనులను పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు.
వీటితోపాటు వి బి జి రాంజీ పనులను మండలంలోని అన్ని పంచాయతీలకు కేటాయించే విధంగా మరియు పనులను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో వేనయ్య తెలియజేశారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రేవతి పాల్గొనడం జరిగింది, 16 వ ఫైనాన్స్ నిధులకు సంబంధించి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేటాయించే విధంగా అధికారులు అన్ని పంచాయతీలకు అభివృద్ధి పనులను ఏర్పాటు చేసుకోవాలని అందుకు తగిన సమీకరణలను ముందుగా పంచాయితీలలో ప్రజలతో మాట్లాడి వారికి అవసరమైన పనులను ఏర్పాటు చేసి పూర్తి చేసే విధంగా కూడా అధికారులు సిద్ధంగా ఉండడం జరుగుతుందని, ఇప్పటికే ఆయా పంచాయితీల అభివృద్ధి పనులను ఎన్నుకోవడం జరుగుతుందని ఎంపీడీవో వేనయ్య తెలియజేయడం జరిగింది.




