Ojili: ఓజిలి మండలం మేనకూరు సెజ్‌లో ఆక్టం లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ప్రారంభం

Ojili: తిరుపతి జిల్లా ఓజిలి మండలం మేనకూరు సెజ్‌లో నూతనంగా ఏర్పాటైన ఆక్టం లైఫ్ సైన్సెస్ సంస్థను ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ శుక్రవారం ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 8:03 PM IST
Ojili
X

Ojili: ఓజిలి మండలం మేనకూరు సెజ్‌లో ఆక్టం లైఫ్ సైన్సెస్ పరిశ్రమ ప్రారంభం

ఓజిలి: తిరుపతి జిల్లా ఓజిలి మండలం లోని అత్తివరం గ్రామ పరిధిలోని మేనకూరు SEZలో నూతనంగా ఏర్పాటు చేసిన Octum Life Sciences సంస్థను సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, సూళ్లూరుపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

Octum Life Sciences సంస్థ అభివృద్ధి చెందుతూ స్థానిక యువతకు వీలైనంత ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంస్థ ప్రతినిధులను కోరారు.మేనకూరు SEZతో పాటు నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story