Tirupati: పాల దుకాణం కోసం వెళ్లాల్సిన వేళ.. మద్యం దుకాణం వద్ద మందు బాబులు క్యూ...!
Tirupati: నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి నిర్ణీత సమయానికి ముందే వైన్స్తె రుస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tirupati: రేణిగుంటలో ఉదయాన్నే మందు బాబుల క్యూ.. నిబంధనలకు తూట్లు!
Tirupati: రేణిగుంట పట్టణ పరిధిలోని టపాసుల గోదాం ప్రక్కన ఉన్న వైన్స్ షాపు,తిరుపతి రేణిగుంట రహదారి వద్ద ఉన్న వైన్స్ షాపుల్లో ఉదయాన్నే మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.
సాధారణంగా నిర్ణీత సమయం తర్వాతే మద్యం విక్రయాలు ప్రారంభించాల్సి ఉండగా,అందుకు ముందే షాపులు తెరిచి విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయాన్నే మద్యం విక్రయాలు జరగడంతో ఆయా ప్రాంతాల్లో మద్యం ప్రియుల సందడి కనబడుతుంది.
నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సంబంధిత ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్ణీత వేళలను పాటించేలా చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత షాపులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.




