Renigunta: రేణిగుంట సీడబ్ల్యూసీ ఈవీఎం గోడౌన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Renigunta: రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సీడబ్ల్యూసీ ఈవీఎం గోడౌన్‌ను తిరుపతి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
Renigunta: రేణిగుంట సీడబ్ల్యూసీ ఈవీఎం గోడౌన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Renigunta: తిరుపతి జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోదాములో 24 గంటలూ నిఘా కొనసాగిస్తూ పటిష్ట భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోదాములో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గోదాములో ఉన్న బ్యాలెట్ యూనిట్లు (బీయూలు), కంట్రోల్ యూనిట్లు (సీయూలు), వివి ప్యాట్ యంత్రాలు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సీలింగ్ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్‌లో సంతకం చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లను గోదాములో భద్రపరిచామని తెలిపారు. ప్రతి నెలా, అలాగే మూడు నెలలకు ఒకసారి గోదాములోని భద్రతా పరిస్థితులు, మరమ్మతుల అవసరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఈ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును సందర్శించినట్లు వెల్లడించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా, భద్రతా చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ఈవీఎం గోడౌన్ ఇన్‌చార్జి, జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్,ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.




