Tirupati: భాకరాపేట ఘాట్‌లో లారీ దగ్ధం కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్!

Tirupati: తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్‌లో ప్లాస్టిక్ పైపుల లారీ అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టి పూర్తిగా దగ్ధం. డ్రైవర్ సురక్షితం, చంద్రగిరి పోలీసుల కేసు నమోదు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 31 Aug 2026 12:45 PM IST
Tirupati
X

Tirupati: భాకరాపేట ఘాట్‌లో లారీ దగ్ధం కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్న డ్రైవర్!

Tirupati: తిరుపతి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ లో పైపుల లారీ అదుపుతప్పి బండరాయిని డీకొనడంతోబ సర్క్యూట్ అయ్యి పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ కిందికి దూకి పరుగులు తీయడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు.

మహారాష్ట్ర లోని బరంపూర్ నుంచి తిరుపతికి ఈచర్ ప్లాస్టిక్ పైపులు లోడ్ వస్తుంది. చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ లోకి వచ్చేసరికి ఈచర్ లారీ అదుపుతప్పి ఎడమ పక్కగా వెళ్లి ఒక పెద్ద బండరాయికి ఢీ కొట్టినది.

ఈ ప్రమాదంలో వాహనములో షాక్ సర్క్యూట్ అవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగగానే డ్రైవరు లారీలో నుంచి కిందికి దూకి పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో వాహనము, ప్లాస్టిక్ పైపులు పూర్తిగా కాలిపోయాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసింది. డీజిల్ ట్యాంకు టైర్లు పగిలిపోవడంతో కొంతసేపు వాహనదారులు భయందోళనకు గురి అయ్యారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story