Renigunta: తిరుపతి ఎయిర్‌పోర్టులో నీటి సమస్య.. వాష్‌రూమ్ బంద్!
Renigunta: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ఏరియాలో నీటి సరఫరా లేక వాష్‌రూమ్‌లకు తాళాలు. ప్రయాణికులు, పోలీసు సిబ్బంది తీవ్ర అవస్థలు.
Renigunta: తిరుపతి ఎయిర్‌పోర్టులో నీటి సమస్య.. వాష్‌రూమ్ బంద్!
రేణిగుంట: తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల పార్కింగ్ ప్రాంతంలోని మరుగుదొడ్డి నీటి సరఫరా లేక మూతపడింది. బోరు మరమ్మతులకు గురికావడంతో రెండు రోజులుగా నీటి సమస్య కొనసాగుతున్నట్లు సమాచారం.
విమానాశ్రయానికి ప్రముఖుల రాకపోకలు పెరిగిన సమయంలో ప్రయాణికులు, విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది వాష్‌రూమ్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విమానాల రాకపోకల సమయంలో పార్కింగ్ ప్రాంతంలో వేచి ఉండే వారికి ఈ సమస్య మరింత అసౌకర్యంగా మారుతోంది.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బోరు సమస్యను పరిష్కరించి, మరుగుదొడ్డికి నీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Next Story




