Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహణ
Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవంలో 3517 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయగా, రాజీవ్ శుక్లా, పరేష్ మైథిలకు గౌరవ డాక్టరేట్లు అందజేశారు.
Tirupati: మోహన్ బాబు విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహణ
తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఎం రంగంపేట లో మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో 3 వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఐపీఎల్ ఛైర్మన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, అంతర్జాతీయ వాటర్ కలర్ ఆర్టిస్ట్ పరేష్ మైథిల్ , మోహన్ బాబు, విష్ణు మంచులు పాల్గొన్నారు.
యంబీయు చాన్స్ లర్ డాక్టర్ మంచు మోహన్ బాబు అధ్యక్షతన ,ప్రో చాన్స్ లర్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఎంబీయూ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఉత్తీర్ణత సాధించిన వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3517 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందించారు.
ఈసందర్భంగా రాజ్య సభ సభ్యులు, బీసిసిఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా, పద్మ శ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ వాటర్ కలర్ ఆర్టిస్ట్ పరేష్ మైథిలకు యంబీయు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఈసందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ యంబీయు నుంచి గొప్ప వ్యక్తులకు గౌరవ డాక్టరేట్ లు అందించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థులు పొందిన విజ్ఞానంతో భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరారు. ప్రో ఛాన్సలర్ విష్ణు మంచు డిగ్రీ పట్టాలను అందుకున్న యువ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జీవితంలో జన్మనిచ్చిన తల్లి తండ్రిని,విద్య నందించిన గురువులను ఎప్పటికీ మరచిపోకూడదన్నారు.




