Tiruchanur: తిరుచానూరులో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష

Tiruchanur: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని తిరుచానూరు దీక్షలో డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.

K VENU, TIRUPATHI RURAL
Published on: 8 Aug 2026 8:07 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరులో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష

తిరుచానూరు: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు, స్పోర్ట్స్ కోటా భర్తీలో జరిగిన పారదర్శకత లోపంపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా శనివారం తిరుచానూరులో నిర్వహించిన దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మోసపోయిన డీఎస్సీ అభ్యర్థుల న్యాయం కోసం, నిరుద్యోగ యువత హక్కుల కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకుని, అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, నరేష్ రెడ్డి, సూరి, హరి, చిన్ని యాదవ్, దామినేటి కేశవులు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story