Tiruchanur: బంగారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సుందరరాజస్వామి!

Tiruchanur: శ్రీ సుందరరాజస్వామివారి జన్మనక్షత్రం ఉత్తరాభాద్ర సందర్భంగా సోమవారం స్వామివారు బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో విహరించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 3 Aug 2026 10:10 PM IST
Tiruchanur
X

Tiruchanur: బంగారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సుందరరాజస్వామి!

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామివారు సోమవారం బంగారు తిరుచ్చి పై మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రం ఉత్తరాభాద్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామి ఉత్సవర్లకు అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చి పై కొలువుదీర్చారు.

అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తిరుచ్చి పై కొలువుదీరి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్,ఏవిఎస్వో శ్రీహరిరావు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story