Tiruchanoor: అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం టిక్కెట్ల విక్రయం ప్రారంభం!

Tiruchanoor: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం. వివరాలు వెల్లడించిన ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్.

K VENU, TIRUPATHI RURAL
Published on: 20 Aug 2026 3:51 PM IST
Tiruchanoor
X

Tiruchanoor: అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం టిక్కెట్ల విక్రయం ప్రారంభం!

Tiruchanoor: రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం వరలక్ష్మి వ్రతం టిక్కెట్ల విక్రయాలను గురువారం ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఇప్పటికే ఆన్లైన్లో 150 టిక్కెట్లు మంజూరు చేయగా, మరో 150 టిక్కెట్లను ఈరోజు అమ్మవారి ఆలయం ముందుభాగంలో ఉన్న కౌంటర్లో భక్తులకు మంజూరు చేశామన్నారు.

శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు అమ్మవారి ఆస్థానమండపంలో వ్రతం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ముని చెంగల్రాయులు ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story