Thottambedu: లంచం డిమాండ్, వ్యాఖ్యల కేసులో తొట్టంబేడు డిటీ సస్పెన్షన్

Thottambedu: తిరుపతి జిల్లా తొట్టంబేడు డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ సస్పెన్షన్. ₹3 లక్షల లంచం డిమాండ్, ఆడియో వివాదంలో చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 21 Aug 2026 9:13 PM IST
Thottambedu
X

Thottambedu: లంచం డిమాండ్, వ్యాఖ్యల కేసులో తొట్టంబేడు డిటీ సస్పెన్షన్

తొట్టంబేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు తహసిల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. 0.09 సెంట్ల భూమికి సంబంధించి రూ.3,00,000 అక్రమ లంచం డిమాండ్,

శెట్టిపల్లి భూములకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పై నిరాధార అసత్య ఆరోపణలు చేసిన ఒక ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో బహిర్గతమైంది. ఈ విషయంపై శ్రీకాళహస్తి తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా సదర ఆడియో రికార్డింగ్ పరిశీలించి అందులోని వాయిస్ తొట్టంబేడు డిప్యూటీ తహసిల్దార్ జీవన్ కుమార్ దిగా గుర్తించారు. అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా జీవన్ కుమార్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూట్స్ కింద జీవన్ కుమార్ పై మూడు అవయోగాలను నమోదు చేసి శాఖపరమైన చర్యలకు ఆదేశించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story