Renigunta: "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటా ప్రచారం!

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలో "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" నినాదంతో టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 9 Aug 2026 8:04 PM IST
Renigunta
X

Renigunta: "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటా ప్రచారం!

రేణిగుంట: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేణిగుంట పట్టణంలో టీడీపీ నాయకులు ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు.శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్ కిరణ్,నాయకులు నాగేశ్వరరావు,ఈ. మురళి ముదిరాజ్,శివయ్య నాయుడు,నరసింహులు,గోపి యాదవ్,రమణ,మనీ,సంపత్,వేణు,బాబు,వెంకటేష్, చిన్నబాబు,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story