Sullurupeta: సూళ్ళూరుపేటలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి బర్త్‌డే

Sullurupeta: సూళ్ళూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు. రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, నేతలు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 28 July 2026 3:37 PM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేటలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి బర్త్‌డే

సూళ్ళూరుపేట: తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా - TUDA) చైర్మన్ సి. దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత వైభవంగా, సేవ గుణంతో నిర్వహించారు. ఏఎంసీ (AMC) చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు ధము రాయల్, అలీబాయ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు పర్యవేక్షించారు.

​ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఘనంగా కేక్ కట్ చేసి, నాయకులందరూ కలిసి తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను నేరుగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు ధైర్యం చెబుతూ పండ్లు, పౌష్టికాహారాన్ని స్వయంగా పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు కేవలం పదవులకే పరిమితం కాకుండా ఇలాంటి సేవా దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివెనలు, అలాగే ఈ ప్రాంత ప్రజల కొంగుబంగారం, ఆరాధ్య దైవమైన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలతో తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి మరెన్నో అద్భుతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని స్వామివారిని, అమ్మవారిని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం ప్రజాసేవ చేయడమే నాయకులకు నిజమైన జన్మదిన వేడుక అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు చిట్టెటి పెరుమాళ్, వెల్లూరు సుధీర్, రవి ,పామురు మునస్వామి,మెడ సాయి ,తదితరులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story