Sullurpeta: జనసేన పార్లమెంట్ నిర్మాణ సారథుల కమిటీ సభ్యుడిగా మాభాషా
Sullurpeta: తిరుపతి పార్లమెంట్ జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడిగా సూళ్ళూరుపేటకు చెందిన షేక్ మాభాషా ఎన్నికయ్యారు.
Sullurpeta: జనసేన పార్లమెంట్ నిర్మాణ సారథుల కమిటీ సభ్యుడిగా మాభాషా
సూళ్ళూరుపేట: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేలా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టిన చర్యల్లో భాగంగా, తిరుపతి పార్లమెంట్ జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ (స్థానిక ఎన్నికల కమిటీ) సభ్యుడిగా సూళ్ళూరుపేటకు చెందిన షేక్ మాభాషా ఎన్నికయ్యారు.
ఈ కీలక బాధ్యతను తనకు అప్పగించడం పట్ల షేక్ మాభాషా హర్షం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండే తమ ప్రియతమ నాయకుడు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు సైనికుడిలా అంకితభావంతో పని చేస్తానని తెలిపారు.




