Puttur: బాటనీ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ ఎగ్జిబిషన్ సూపర్ సక్సెస్!
Puttur: తిరుపతి జిల్లా పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఎగ్జిబిషన్ జరిగింది.
Puttur: బాటనీ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ ఎగ్జిబిషన్ సూపర్ సక్సెస్!
పుత్తూరు: ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.
ఈ ప్రదర్శనను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బీఎస్సీ బాటనీ విద్యార్థులు జీవవైవిధ్య సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, బయోగ్యాస్ ఉత్పత్తి, సేంద్రియ జీవ ఎరువుల తయారీ, వాటి ప్రయోజనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన వినూత్న వస్తువులను ప్రదర్శిస్తూ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరించారు.
ప్రదర్శనను సందర్శించిన అధ్యాపకులు, వివిధ విభాగాల విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రకృతి సంరక్షణ ప్రాముఖ్యతపై విద్యార్థులు వివరించడంతో అధ్యాపకులు వారిని అభినందించారు. విద్యార్థుల సృజనాత్మకత, పర్యావరణంపై అవగాహనను కొనియాడుతూ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించినందుకు ప్రశంసలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగం ఇన్‌చార్జి డాక్టర్ జి. కోటేశ్వరరావు, డాక్టర్ సుజనా, అరుణ కుమారి, అరవింద్, కోఆర్డినేటర్ & వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరయ్య, డాక్టర్ ప్రభాకర్ రావు, వెంకట సుబ్బయ్య, ఎ. నాగేశ్వరరావు, సురేష్ బాబు, రఘురాం, శ్రీదేవి, డాక్టర్ బాబు, మీడియా ప్రతినిధి సంక్రాంతి రాజేంద్రుడు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




