Tiruchanur: తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న శ్రీరంగం పీఠాధిపతి
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీ దర్శించుకున్నారు.
Tiruchanur: తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న శ్రీరంగం పీఠాధిపతి
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీ కు పెద్ద మర్యాదతో ఘన స్వాగతం లభించింది.
ముందుగా ఆలయానికి చేరుకున్న పీఠాధిపతి కి ఆలయ అధికారులు, అర్చకులు శటారి మర్యాదతో వేదమంత్రోచ్ఛారణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి పీఠాధిపతి మ్రోక్కుల తీర్చుకున్న అనంతరం మూల మూర్తిని దర్శించుకున్నారు.
అనంతరం వేద పండితులు శేష వస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, ఆలయ అర్చకులు బాబు స్వామి, వేంపల్లి శ్రీనివాసులు స్వామి ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, చలపతి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




