Srikalahasti: శ్రీకాళహస్తిలో ప్రపంచ మెకానిక్ డే.. భారీ బైక్ ర్యాలీ

Srikalahasti: శ్రీకాళహస్తిలో ప్రపంచ మెకానిక్ డే వేడుకలను టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ యూనియన్ ఘనంగా నిర్వహించింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 July 2026 6:28 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ప్రపంచ మెకానిక్ డే.. భారీ బైక్ ర్యాలీ

Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలో ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా శ్రీకాళహస్తి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ టూ వీలర్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మెకానిక్‌లకు ప్రపంచ మెకానిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, సమాజానికి నిరంతరం సేవలందిస్తున్న టూ వీలర్ మెకానిక్‌ల సేవలు ఎంతో విలువైనవని అన్నారు.

మెకానిక్‌లందరూ యూనియన్‌గా ఐక్యంగా ఉండి తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.ఐక్యతే సంఘానికి బలమని, యూనియన్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ ర్యాలీలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు, యూనియన్ నాయకులు, మెకానిక్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రపంచ మెకానిక్ డేను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో మిన్నల్ రవి, ఉమేష్ రావు మోరే,కంటా రమేష్, కాసారం రమేష్, వజ్రం కిషోర్, మెకానిక్ యూనియన్, ప్రెసిడెంట్ అంజద్,యూనియన్ సభ్యులు జయ,మోహన్,శంకర్, అయ్యప్ప, బాబు,మహేశ్, కిషోర్, ఉమాపతి, గోపి తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story