Srikalahasti: శ్రీకాళహస్తి 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం

Srikalahasti: శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్‌లో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం. పరిశుభ్రతే ఆరోగ్యమని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చిన కూటమి నాయకులు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 18 July 2026 4:39 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం

శ్రీకాళహస్తి: మన "శ్రీకాళహస్తి – మన బాధ్యత" అనే నినాదంతో ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని, ఇక్కడ పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

పట్టణం, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించకుండా నివారించవచ్చని తెలిపారు. "పరిశుభ్రమైన శ్రీకాళహస్తి నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత" అని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సేవలను ప్రత్యేకంగా అభినందించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చివరగా, ప్రతి కుటుంబం తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' లక్ష్య సాధనకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story