Renigunta: శ్రీకాళహస్తి ఓటర్ల జాబితా విచారణ తేదీలు మార్పు!

Renigunta: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) విచారణ తేదీలు మారాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చదవండి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 25 Aug 2026 9:29 PM IST
Renigunta
X

Renigunta: శ్రీకాళహస్తి ఓటర్ల జాబితా విచారణ తేదీలు మార్పు!

రేణిగుంట: శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం (నెం. 168) పరిధిలోని రేణిగుంట మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) విచారణ తేదీలను మార్చినట్లు సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (AERO) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాల కారణంగా ఈ విచారణలను వాయిదా వేసి,కొత్త తేదీలను ఖరారు చేశారు.

​మారిన విచారణ తేదీల వివరాలు:

​పోలింగ్ స్టేషన్లు164,165,166, 168 : ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి గతంలో 21.08.2026న జరగాల్సిన విచారణ,వరలక్ష్మీ వ్రతం సెలవు దినం కావడంతో 02.09.2026కి మార్చబడింది.

​పోలింగ్ స్టేషన్లు 179, 180, 181, 182 :ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 26.08.2026న జరగాల్సిన విచారణ, మిలాద్-ఉన్-నబి (ఈద్-ఎ-మిలాద్) సెలవు దినం కావడంతో 03.09.2026కి మార్చబడింది.

​ఓటర్లకు సూచన:

​SIR-2026 విచారణకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న ఓటర్లు ఈ మార్పులను గమనించి, పునఃనిర్ణయించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని అధికారులు కోరారు. అయితే, నోటీసులలో పేర్కొన్న విచారణ వేదిక (Venue) మరియు సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ​తప్పులు లేని, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రజలందరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story