Renigunta: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Renigunta: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు. రేణిగుంటలో టీడీపీ నేత మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, అక్షయ క్షేత్రంలో పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 May 2026 8:38 PM IST
Renigunta
X

Renigunta: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో జామ్ జామ్ హోటల్ సర్కిల్ వద్ద పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలు నాటారు. అనంతరం అక్షయ క్షేత్రంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు పుష్ప నాదం, వెంకట ముని రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు నవాబ్, బాబు, సంపత్, గజేంద్ర, యువ నాయకుడు బూత్ ఇంచార్జ్ కిరణ్, సాగర్, నెల్లూరు సుబ్రహ్మణ్యం,జయ,హామీద,ప్రభు,వంశీ,తెలుగుదేశం పార్టీ నాయకులు,వార్డు ఇన్‌చార్జీలు, యువనాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story