Thottambedu: ప్రతాప్ రెడ్డి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి!
Thottambedu: తోట్టంబేడు మండలం కన్నలి గ్రామంలో కన్నలి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
Thottambedu: ప్రతాప్ రెడ్డి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి!
తోట్టంబేడు: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం తోట్టంబేడు మండలం కన్నలి గ్రామంలో తన బంధుమిత్రుడు,ఆత్మీయుడు కన్నలి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.ప్రతాప్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే ఆయనతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కొంతసేపు గడిపారు.
అనంతరం కన్నలి గ్రామంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలను నేరుగా కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వ హయాంలో కన్నలి గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని, గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.




