Srikalahasti: జగ్గరాజుపల్లిలో వైభవంగా శ్రీ రాములవారి ఆలయ కుంభాభిషేకం!
Srikalahasti: శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ రాములవారి ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో కాంగ్రెస్ నేత తలపా దామోదరం రెడ్డి పాల్గొన్నారు.
Srikalahasti: జగ్గరాజుపల్లిలో వైభవంగా శ్రీ రాములవారి ఆలయ కుంభాభిషేకం!
Srikalahasti: శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రాములవారి ఆలయ కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన గ్రామస్థులను అభినందించిన ఆయన, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, మండల యువజన అధ్యక్షుడు యానాది నవీన్ కుమార్, పట్టణ యువజన అధ్యక్షుడు ఆంటోనీతో పాటు శశి, సురేష్, మహేష్, లక్ష్మయ్య, మాస్, అరుణ్, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




