Srikalahasti: శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవ సంబరం: ధ్వజారోహణంతో ప్రారంభం!

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 18 July 2026 1:16 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవ సంబరం: ధ్వజారోహణంతో ప్రారంభం!

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాల తొలి రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ , ధర్మకర్తల మండలి చైర్మన్ , పాలకమండలి సభ్యులు, కూటమి ముఖ్య నాయకులు ఎమ్మెల్యే మరియు కోలా ఆనంద్, అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఈ నెల 29వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ పాల్గొని, శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజ స్వామివారి దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story