Srikalahasti: రోడ్డుపైనే పారుతున్న మురుగునీరు నరకం చూస్తున్న గ్రామస్తులు!
Srikalahasti: శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు ప్రధాన రహదారిపై మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Srikalahasti: రోడ్డుపైనే పారుతున్న మురుగునీరు నరకం చూస్తున్న గ్రామస్తులు!
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అరవకొత్తూరు గ్రామంలో ప్రధాన రహదారిపై మురుగు నీరు నిల్వ ఉండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రోజులుగా రోడ్డుపైనే మురుగు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల బెడద పెరిగి, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు పరిష్కారం లభించలేదని వారు వాపోతున్నారు. వెంటనే మురుగు నీటిని తొలగించి, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
Next Story




