Srikalahasti: మూగజీవంపై విచక్షణారహిత దాడి.. జెట్టిపాలెంలో తీవ్ర కలకలం!

Srikalahasti: శ్రీకాళహస్తి జెట్టిపాలెం ప్రాంతంలో ఓ యువకుడు కుక్కను అత్యంత దారుణంగా కొట్టి చంపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Updated on: 31 Aug 2026 3:05 PM IST
Srikalahasti
X

Srikalahasti: మూగజీవంపై విచక్షణారహిత దాడి.. జెట్టిపాలెంలో తీవ్ర కలకలం!

శ్రీకాళహస్తి: పట్టణంలోని జెట్టిపాలెం ప్రాంతంలో ఓ యువకుడు కుక్కను అత్యంత దారుణంగా కొట్టి చంపుతున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. అమాయక జంతువుపై యువకుడు విచక్షణారహితంగా దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జంతువులపై ఇలాంటి క్రూరత్వానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు. కుక్కను ఎందుకు కొట్టాడు? ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపడితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story