Tiruchanur: బంగారు తిరుచ్చిపై శ్రీ సూర్యనారాయణ స్వామి ఊరేగింపు!

Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి హస్త నక్షత్రం సందర్భంగా బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 13 Sept 2026 5:59 PM IST
Tiruchanur
X

Tiruchanur: బంగారు తిరుచ్చిపై శ్రీ సూర్యనారాయణ స్వామి ఊరేగింపు!

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ఆదివారం బంగారు తిరుచ్చి పై తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రం హస్త నక్షత్రము సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు.

సాయంత్రం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చి పై కొలువుదీర్చారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు తిరుచ్చి పై కొలువుదీరి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు.

పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయులు, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL