Tirupati: రైల్వే, జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలి!
Tirupati: తిరుపతి జిల్లాలో రైల్వే, జాతీయ రహదారులు, ఏపీఐఐసీ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదేశం.
Tirupati: రైల్వే, జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలి!
Tirupati: తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు,జాతీయ రహదారులు,ఏపీఐఐసీ ప్రాజెక్టులు, భూసేకరణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి రైల్వే, జాతీయ రహదారులు, వైజాగ్-చెన్నై కారిడార్,ఏపీఐఐసీ, దుగ్గరాజపట్నం పోర్టు,ఏడీబీ రోడ్లు తదితర పనులపై సమీక్ష నిర్వహించారు.
శ్రీ సిటీ ఫేజ్-2, ఎల్‌జీ ఫేజ్-1, 2, 3,స్పేస్ సిటీ, నాయుడుపేట ఫేజ్-2,వానెల్లూరు, పాగలి,రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కోర్టు కేసులు,వెబ్‌ల్యాండ్ సమస్యలను సైతం సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
నడికుడి–శ్రీకాళహస్తి,ఏర్పేడు–పూడి గూడూరు–రేణిగుంట, పాకాల–తిరుపతి,తిరుపతి–కాట్పాడి,అరక్కోణం–రేణిగుంట రైల్వే ప్రాజెక్టులతో పాటు నాయుడుపేట–రేణిగుంట, రేణిగుంట–కడప,రేణిగుంట–చెన్నై జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని తెలిపారు.పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి ఆర్డీఓలు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
వడమాలపేట,ఏర్పేడు మండలాల్లో టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని సూచించారు.సమావేశంలో ఆర్డీఓలు,ఏపీఐఐసీ, రైల్వే,ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్,ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




