Chandragiri: గుర్రప్ప దేవాలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు!

Chandragiri: తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం పరిధిలోని గుర్రప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 13 Sept 2026 7:59 PM IST
Chandragiri
X

Chandragiri: గుర్రప్ప దేవాలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు!

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామపంచాయతీ గాంధీనగర్ సమీపంలోని గురప్ప దేవాలయంలో కొప్పరవాండ్లపల్లికి చెందిన కఠారి మునిరత్నం దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం కొప్పర వాండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయం చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారికి అభిషేకాలు నిరూపించి ప్రత్యేక హారతులు చేపట్టారు.కఠారి మునిరత్నం మనవరాలు పేరున అర్చనలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి మనోహర్ చౌదరి, మునీశ్వరయ్య గౌడ్, షావలి గంగాధర్ మరియు స్థానికులు పాల్గొన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI