Srikalahasti: టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. ఏర్పాట్లు ముమ్మరం
Srikalahasti: జూలై 1న శ్రీకాళహస్తికి రానున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. కొత్తపాలెం పరిధిలో సభా స్థలాన్ని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించినఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.
Srikalahasti: టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. ఏర్పాట్లు ముమ్మరం
శ్రీకాళహస్తి: రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూలై 1న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో కొత్తపాలెం పరిధిలో సభా స్థలాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు పరిశీలించారు.
సభ నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, వేదిక పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు,కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు,పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story




