Tirupati: వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొన్న అడపా సురేంద్ర, తోట కళ్యాణ్!
Tirupati: ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఏకే ఎలివేటర్స్ అధినేత తోట కళ్యాణ్ హాజరై వ్యాపార రంగ అభివృద్ధిపై చర్చించారు.
Tirupati: వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొన్న అడపా సురేంద్ర, తోట కళ్యాణ్!
తిరుపతి: తిరుపతిలోని తాజ్ హోటల్‌లో నిర్వహించిన రాయల్ ఎలైట్ బిజినెస్ మీట్ కార్యక్రమానికి మదనపల్లె జనసేన పార్టీ యువ నాయకులు, ఏకే ఎలివేటర్స్ అధినేత తోట కళ్యాణ్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర హాజరయ్యారు. తిరుపతికి చెందిన డాక్టర్ రమణ ఆహ్వానం మేరకు వ్యాపారవేత్తల సమావేశంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యాపార రంగానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏకే ఎలివేటర్స్ అధినేత తోట కళ్యాణ్, డాక్టర్ రమణలను అడపా సురేంద్ర ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి, గజమాలతో అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి పవన్ కుమార్, నిమ్మనపల్లి మండల అధ్యక్షులు సోలంకి ప్రదీప్ సింగ్, ఆకుల వీరాంజనేయులు, పూలకొండం మోహన్ కుమార్ రాయల్, పసుపులేటి చంద్రశేఖర్‌తో పాటు జనసేన కార్యకర్తలు అఫ్రోజ్ ఖాన్, తానేశ్వర్, సోను, ఫాజిల్, నరేంద్ర, అజయ్, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




