Renigunta: సెప్టెంబర్ 1 నుంచి రేణిగుంట విమానాశ్రయంలో కొత్త టైమింగ్స్!

Renigunta: రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయం నుంచి సెప్టెంబర్ 1 నుంచి హైదరాబాద్, ఢిల్లీ, విశాఖపట్నం, శివమొగ్గ నగరాలకు కొత్త విమానాల షెడ్యూల్ అమల్లోకి రానుంది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 31 Aug 2026 2:58 PM IST
Renigunta
X

Renigunta: సెప్టెంబర్ 1 నుంచి రేణిగుంట విమానాశ్రయంలో కొత్త టైమింగ్స్!

రేణిగుంట: రేణిగుంట విమానాశ్రయం నుంచి సెప్టెంబర్ 1 నుంచి పలు నగరాలకు విమానాల రాకపోకల సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇండిగో, స్టార్ ఎయిర్, ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది.

హైదరాబాద్‌కు ఉదయం 7:20 గంటలకు ఇండిగో (6E6567), 11:15 గంటలకు (6E7503), మధ్యాహ్నం 1:50 గంటలకు (6E6296), సాయంత్రం 5:10 గంటలకు ఎయిర్ ఇండియా (IX1829), రాత్రి 8:20 గంటలకు ఇండిగో (6E6565) విమానాలు నడవనున్నాయి.

శివమొగ్గకు మధ్యాహ్నం 12:20 గంటలకు స్టార్ ఎయిర్ (S5202), విశాఖపట్నానికి మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండిగో (6E7063), ఢిల్లీకి సాయంత్రం 6:25 గంటలకు ఇండిగో (6E2378) విమానం రాకపోకలు సాగించనున్నాయి.

విమానాల సమయాల్లో మార్పులు ఉన్నందున ప్రయాణికులు కొత్త షెడ్యూల్‌ను ముందుగా పరిశీలించి, తమ ప్రయాణాలను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఎయిర్లైన్స్ అధికారులు సూచించారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story