Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో క్రికెటర్ తిలక్ వర్మకు స్వాగతం
Renigunta: శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెటర్ తిలక్ వర్మకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు, అభిమానులు.
Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో క్రికెటర్ తిలక్ వర్మకు స్వాగతం
రేణిగుంట: రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఘన స్వాగతం లభించింది.తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రేణిగుంట టీడీపీ మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు తిలక్ వర్మకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిభ చాటుతూ తెలుగువారికి మంచి పేరు తీసుకొస్తున్న తిలక్ వర్మను నాయకులు అభినందించారు.
విమానాశ్రయం వెలుపల తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు. ఆయనతో ఫొటోలు,సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. అనంతరం తిలక్ వర్మ రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
Next Story




