Renigunta: స్పేస్ వీక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన తపస్య విద్యార్థులు

Renigunta: రేణిగుంట రీజినల్ సైన్స్ సెంటర్‌లో జరిగిన స్పేస్ వీక్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డా. బషీర్స్ తపస్య పాఠశాల విద్యార్థులు. అభినందించిన యాజమాన్యం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 22 July 2026 6:54 PM IST
Renigunta
X

Renigunta: స్పేస్ వీక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన తపస్య విద్యార్థులు

రేణిగుంట: రీజినల్ సైన్స్ సెంటర్ లో స్పేస్ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న డా.బషీర్స్ తపస్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు.గత వారం రోజులుగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంటు ఆఫ్ ఇండియా వారి నేతృత్వంలో జూలై 17 నుండి 22 వరకు నిర్వహింపబడిన స్పేస్ వీక్ కార్యక్రమంలో విజేతలుగా నిలిచారని పాఠశాల యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు.

తపస్య రేణిగుంట విద్యార్థులు ఓపన్ హౌస్ క్విజ్ విజేతలుగా షాజైబ్, వేదాంతో,హేనిష్క,రిషితా సత్య, సానియాభాను, సుష్మశ్రీ, పోషిత, కార్తీక్,భవ్యశ్రీ,అల్జెహ్రా,హీరా,నాథన్,శ్రీనిక.

పెయింటింగ్ నందు షాజైబ్ హీరా డాక్యుమెంటరీ విభాగంలో సుష్మశ్రీ అగ్రశ్రేణిలో నిలిచారు. ఇంటర్ స్కూల్ కాంటెస్ట్,పాపులర్ సైన్స్ లెక్చర్ వంటి వివిధ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభా పాఠవ ప్రదర్శనతో తమ సత్తాను నిరూపించుకున్నారు.వీరికి కరస్పాండెంట్ విక్రమ్ శాలి, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు తదితరులు అభినందనలు తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story