Renigunta: రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు
Renigunta: అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు - డీఎస్పీ శ్రీనివాస రావు.
Renigunta: రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు
రేణిగుంట: సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా,తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో 2026 జూన్ 1 వ తేదీ నుండి జూన్ నెల 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాస రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు,ర్యాలీలు,ధర్నాలు, రాస్తారోకోలు మరియు ఇతర గుంపులుగా నిర్వహించే కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు.
రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలోని రేణిగుంట,గాజులమండ్యం,ఏర్పేడు, రైల్వే కోడూరు,ఓబులవారిపల్లె, చిట్వేల్,పుల్లంపేట మరియు పెనగలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు.పై నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.




