Renigunta: రేణిగుంటలో రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ ప్రారంభం
Renigunta: రేణిగుంట ఎన్టీఆర్ సర్కిల్‌లో జూలై 29న రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ ప్రారంభం. జనసేన నాయకుడు మిథున్ శాలి ఆధ్వర్యంలో మహిళలు, యువతకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ.
Renigunta: రేణిగుంటలో రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ ప్రారంభం
రేణిగుంట: రేణిగుంట ఎన్టీఆర్ సర్కిల్‌లోని బషీర్ కాంప్లెక్స్‌లో రాక్ ఫైటర్స్ టెక్వాండో క్లబ్ ను జనసేన నాయకుడు మిథున్ శాలి ఆధ్వర్యంలో జూలై 29 ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా మిథున్ శాలి మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌పై చూపుతున్న ఆసక్తి, క్రమశిక్షణ,ఆత్మరక్షణపై ఆయన ఇస్తున్న ప్రాధాన్యతతో స్ఫూర్తి పొంది ఈ టెక్వాండో క్లబ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
ముఖ్యంగా నేటి పరిస్థితుల్లో ప్రతి మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ నైపుణ్యాలు ఎంతో అవసరమని,అదేవిధంగా చిన్నారులు,యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు.క్లబ్ వ్యవస్థాపకుడు,కోచ్ వై.అవినాష్ ఆధ్వర్యంలో టెక్వాండోతో పాటు సెల్ఫ్ డిఫెన్స్,నన్‌చాకు,సిలంబం, ఉరుమి వంటి శిక్షణలు అందించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విజయ్ ఆనంద్,జొన్నలగడ్డ మురళి, శ్రీనివాసులు,టి మణికంఠ, జ్యోతి కుమార్,చిన్నా,జాన్, మహేష్,క్రీడాకారులు,యువత పాల్గొని క్లబ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.




