Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఘనంగా 164వ ‘స్టేషన్ మహోత్సవం’!

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్ 164వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్టేషన్ మహోత్సవం నిర్వహించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 27 Aug 2026 1:17 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఘనంగా 164వ ‘స్టేషన్ మహోత్సవం’!

Renigunta: చారిత్రక రేణిగుంట రైల్వే స్టేషన్‌ 164వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్టేషన్‌ ప్రాంగణంలో స్టేషన్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గుంతకల్లు రైల్వే డివిజన్‌ రైల్వే డివిజనల్ మేనేజర్‌ చంద్రశేఖర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేణిగుంట జంక్షన్‌ గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని కీలక స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. రేణిగుంట రైల్వే స్టేషన్‌ చారిత్రక ప్రస్థానాన్ని, 164 ఏళ్లుగా ప్రయాణికులకు అందిస్తున్న సేవలను అధికారులు వివరించారు. స్టేషన్‌ అభివృద్ధి, ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సౌకర్యాలు, భవిష్యత్‌లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. రేణిగుంట రైల్వే స్టేషన్‌ చరిత్రలో 164 ఏళ్ల ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. కాలానుగుణంగా స్టేషన్‌ అభివృద్ధి చెందుతూ వేలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న కీలక రైల్వే జంక్షన్‌గా ఎదిగిందన్నారు. రైల్వే ఉద్యోగులు, సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాటు రైల్వే పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రత, స్టేషన్‌లో క్రమశిక్షణ, రైల్వే ఆస్తుల పరిరక్షణ తదితర అంశాలపై కూడా అవగాహన కల్పించారు. రైల్వే పోలీసుల సమన్వయంతో కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది.

164 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన స్టేషన్ మహోత్సవంతో రేణిగుంట రైల్వే స్టేషన్‌లో సందడి నెలకొంది. రైల్వే అధికారులు,ఉద్యోగులు, పోలీసు సిబ్బంది,ప్రయాణికులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story