Renigunta: శెట్టిపల్లి వృద్ధాశ్రమంలో రైల్వే సీఆర్‌ఎస్ ఉద్యోగుల సేవా కార్యక్రమం
Renigunta: రేణిగుంట రైల్వే సీఆర్‌ఎస్ ఎలక్ట్రికల్ పీఎం, ఓపీయం శాఖల ఉద్యోగులు తమ జీతాల నుంచి విరాళాలు సేకరించి శెట్టిపల్లి వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
Renigunta: శెట్టిపల్లి వృద్ధాశ్రమంలో రైల్వే సీఆర్‌ఎస్ ఉద్యోగుల సేవా కార్యక్రమం
రేణిగుంట: రైల్వే సీఆర్‌ఎస్ సంస్థలోని ఎలక్ట్రికల్ పీఎం, ఓపీయం శాఖలకు చెందిన ఉద్యోగులు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం తమ జీతాల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా జమ చేసి, అందరూ కలిసి శెట్టిపల్లి సమీపంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది కూడా సంస్థ చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ ఆధ్వర్యంలో శెట్టిపల్లిలోని శబరి వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమానికి ఏడాది పాటు అవసరమయ్యే నిత్యావసర సరుకులు, తినుబండారాలు, స్టీల్ వస్తువులు, ఫ్యాన్లు అందజేశారు.
వృద్ధులకు అవసరమైన వస్తువులను అందించి, వారితో కొంతసేపు ఆప్యాయంగా గడిపారు. సేవా కార్యక్రమంలో రైల్వే సీఆర్‌ఎస్ సంస్థకు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.




