Renigunta: రేణిగుంటలో రౌడీ షీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
Renigunta: రేణిగుంటలో రౌడీ షీటర్లకు పోలీస్ కౌన్సిలింగ్!
Renigunta: రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు,సస్పెక్ట్ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. జయచంద్ర పాల్గొని వారికి పలు సూచనలు చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా క్రమశిక్షణతో జీవించాలని సూచించారు.
గొడవలు, బెదిరింపులు, భూ వివాదాలు, గంజాయి ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి మంచి పౌరులుగా జీవించాలని,
యువతను కూడా చెడు మార్గాల వైపు వెళ్లకుండా ప్రోత్సహించాలని సూచించారు. రేణిగుంట పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని,
అనుమానాస్పద వ్యక్తులు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.




