Renigunta: భారీ వాహనాల తాకిడికి కుంగుతున్న రేణిగుంట రోడ్డు

Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని పోలీస్ స్టేషన్ లైన్ - మిరియాల బాబా వీధిలో భారీ వాహనాల వల్ల కుంగుతున్న రహదారి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 July 2026 10:21 AM IST
Renigunta
X

Renigunta: భారీ వాహనాల తాకిడికి కుంగుతున్న రేణిగుంట రోడ్డు

Renigunta: రేణిగుంట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లైన్ - మిరియాల బాబా వీధిలో భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్డు దెబ్బతిని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది.వీధిలోని కల్వర్టు భాగం పూర్తిగా పాడై కాంక్రీట్ పలకలు విరిగిపోవడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో నిత్యం భారీ లారీలు, ఇతర హెవీ వెహికల్స్ సంచరించడం వల్ల రోడ్డు క్రమంగా కుంగిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

కొంతమంది వ్యాపారులు తమ వ్యాపార అవసరాల కోసం ఈ ఇరుకైన వీధిలోకి భారీ వాహనాలను తరచూ అనుమతించడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దెబ్బతిన్న రహదారిపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.

వర్షాలు కురిస్తే గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దెబ్బతిన్న కల్వర్టు,రోడ్డును మరమ్మతు చేయడంతో పాటు ఈ వీధిలో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని సంబందిత అధికారులు, ట్రాఫిక్ పోలీసులను ప్రజలు కోరుతున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story