Renigunta: HMTV కథనానికి బిగ్ ఇంపాక్ట్ కల్వర్టు పనులు ప్రారంభం!

Renigunta: HMTV వెబ్ వార్తకు అధికారుల స్పందన. రేణిగుంట పోలీస్ లైన్ వీధిలో కుంగిపోయిన రోడ్డుకు శాశ్వత పరిస్కారంగా కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 21 July 2026 7:06 AM IST
Renigunta
X

Renigunta: HMTV కథనానికి బిగ్ ఇంపాక్ట్ కల్వర్టు పనులు ప్రారంభం!

Renigunta: భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతిని కుంగిపోయిన రేణిగుంట పోలీస్ లైన్ వీధి సమస్యపై HMTV వెబ్ లో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు.ప్రమాదకరంగా మారిన రోడ్డును పరిశీలించిన సంబంధిత అధికారులు,సమస్యకు శాశ్వత పరిష్కారంగా కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు.

భారీ లారీల రాకపోకల కారణంగా కల్వర్టు కుంగిపోవడంతో వాహనదారులు,ప్రజలు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా వర్షాల సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం ఈ సమస్యను HMTV ప్రముఖంగా ప్రసారం చేసింది.

వార్త ప్రసారమైన వెంటనే స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి,కల్వర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా స్థానికులు,వాహనదారులు సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన HMTVకు, అలాగే వెంటనే స్పందించి పనులు ప్రారంభించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.కల్వర్టు నిర్మాణం పూర్తయితే రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి,ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story